నిత్యజీవితంలో కంప్యూటర్లు సెల్ ఫోన్లు ఇతర గాడ్జెట్లు సగటు మనిషి జీవితంతో సైతం పెనవేసుకుపోతున్నాయి. కంప్యూటర్ లిటరేట్ అయి ఉండటం భావి తరాలవారికి ఒక కంపల్షన్గా మారింది. కంప్యుటర్ ఇంటర్నెట్ ఆవిష్కరణలు అనేక నూతన సాంప్రదాయాలకు కూడా నాంది పలికాయి. విజ్ఞాన సర్వస్వం ప్రజలకు అందుబాటులో ఉండాలి అని ఎవరైనా అంటే అందరం అంగీకరిస్తాము, కార్పొరేట్ కంపెనీల గుప్పెట్లో కాపీ రైటు పేటెంట్ల వంటి అంశాల ద్వారా విజ్ఞానం బందీ అవుతున్న నేటి తరుణంలో అసలు సాధ్యమయ్యే అంశమేనా అని తప్పకుండా అనిపిస్తుంది. కులాసా రయుళ్ల మాటలో చెప్పాలంటే "వెళ్ళెళ్ళవయ్యా మా చెప్పొచ్చావులే చోద్యం" అంటారు . అందులోను ఐటి అంటే అసలు నమ్మసక్యం కాదు . కానీ ఇటువంటి ఒక నూతన సాంప్రదాయానికి శ్రీకారం చుట్టింది కూడా ఐటి రంగంలోనే.