ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనం ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ను వాడుతున్నాము. ఫ్రీ సాఫ్ట్‌వేర్ వాడకం రోజు రోజుకి పెరుగుతోంది. దీని వాడకం వల్ల మనకు ఇతర సాఫ్ట్‌వేర్‌లో లేని ఎన్నొ హక్కులు మనకు వస్తాయి. ఫ్రీ సాఫ్ట్‌వేర్ ప్రాదాన్యంగా గ్ను జి.పి.ఎల్. అనే లైసెంస్ నిబంధనల ప్రకారం లభిసుంది. గ్ను జి.పి.ఎల్. మనకు ఇచే హక్కులను తెలుకోవటం లాభదాయకంగా వుంటుంది. ఉదాహరణకు మీరు ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ను ఎవరికైనా చట్టబద్దంగా కాపీలు చేసి అమ్మవచ్చు. పైగా మీ సాఫ్ట్‌వేర్‌ను ఫ్రీ సాఫ్ట్‌వేర్‌గా విడుదల చెయాలని నిర్ణయించినప్పుడు గ్ను జి.పి.ఎల్.ను సులభంగా వాడుకోవచ్చు. మీరు గ్ను జి.పి.ఎల్. సాఫ్ట్‌వేర్‌ను వాడినప్పుడు, ఇతరులకు పంచినప్పుడు, దీనిని ఆధారంగా చేసుకొని మీరుక సాఫ్ట్‌వేర్ తయారు చేసినప్పుడు కొన్ని నిబంధనలకు కట్టుబడి వండాలి.
ఒక సాఫ్ట్‌వేర్ సృష్టికర్త మనకు తను తయారుచేసిన సాఫ్ట్‌వేర్‌ను అమ్మినప్పుడు కానీ, ఉచితంగా ఇచ్చినప్పుడు కానీ ఆ సాఫ్ట్‌వేర్ యెక్క వాడకం ఒక ఒప్పందానికి లొబడి ఉంటుంది. దీనినే లైసెన్స్ అంటారు. సాఫ్ట్‌వేర్‌ను ఎటువంటి ఉపయోగాలకు వడవచ్చు? ఇతరులకు కాపీలు తయారు చేసి ఇవ్వవచ్చా లేదా? సాఫ్ట్‌వేర్ను మార్చటానికి హక్కులు వున్నయ్యా లేదా? ఇటు వంటి విషయాలు విష్లేషిస్తుంది. గ్ను జనరల్ పబ్లిక్ లైసెన్స్ (గ్ను జి.పి.ఎల్.) కూడా ఒక సాఫ్ట్‌వేర్ లైసెన్స్. దినిని ఫ్రీ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్ వారు రూపొందించారు. దిని రెండవ సంచికను 1991లో విడుదల చేసారు. ఇదే ప్రస్తుతం ఎక్కువగా వాడుకలో వుంది.